- కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
- బిఎంఎస్ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందని బిఎంఎస్ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన 37 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. సింగరేణి యాజమాన్యానికి ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ మీద లేదని, సింగరేణి జరుగుతున్న ప్రమాదాలకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. సింగరేణిలో 70 శాతం, కోల్ ఇండియాలో 80 శాతం బొగ్గు ఉత్పత్తి కాంట్రాక్టు కార్మికుల వల్లనే వస్తుందని, సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించడం లేదని, కాంట్రాక్టు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, కాంట్రాక్టు కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు కార్మికుల కుటుంబ సభ్యులకు వైద్యం అందించాలని, ఖాళీగా ఉన్న క్వార్టర్లు కాంట్రాక్టు కార్మికులకు పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని అన్నారు. లేబర్ కోడ్ లపై కొన్ని కార్మిక సంఘాలు ఉద్దేశ్యపూర్వకంగా గందరగోళం చేస్తున్నాయని, 4 లేబర్ కోడ్ లలో 2 లేబర్ కోడ్ లు కార్మికులకు అనుకూలంగా ఉన్నాయని, మిగతా రెండు కోడ్ లపై చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నాయకులు మండ రమాకాంత్, పులి రాజారెడ్డి, యాదగిరి సత్తయ్య, సారంగపాణి, హరీష్, దుర్గం రమేష్, మద్దూరి రాజు తదితరులు పాల్గొన్నారు.