కాళోజీ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం

  • శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
  • ఘనంగా ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు  
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలు ఆచరణీయం అని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, కాళోజీ నారాయణ రావు తెలంగాణ ఉద్యమ పితామహుడిగా ప్రసిద్ధి చెందారని, తెలంగాణ ప్రజల ప్రతిధ్వనిగా నిలిచారని, ప్రజల గోడును రాతలు గా మార్చిన గొప్ప కవి, ఉద్యమకారుడని, ఆయన రచనలు ప్రజల భావోద్వేగాలకు అద్దం పట్టాయని, ‘నా గొడవ’, ‘జీవన గీత’ వంటి రచనలు సామాన్యుల గొంతుగా నిలిచాయని, కాళోజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి గౌరవించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, జీఎం కార్యాలయ పిట్  కార్యదర్శి సందీప్, అధికారుల సంఘం నాయకులు వి దేవేందర్ రెడ్డి, డీజీఎంలు ఎస్. అనిల్ కుమార్, ఆనంద్ కుమార్, ఎస్టేట్స్ అధికారి వరలక్ష్మి, లా అధికారి ప్రబంధిత, డీవైపీఎం రాజేష్, అకౌంట్స్ అధికారి నరేష్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
AD 01

Follow Me

images (40)

Leave a Comment