19
- తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన చారి
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఈనెల 23న శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో తెలంగాణ జాగృతి, హెచ్ఎంఎస్ యూనియన్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలను మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన చారి కోరారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఈ బతుకమ్మ వేడుకలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని, 2008వ సంవత్సరంలో మొదటిసారి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి పాత్ర కీలకమని, బతుకమ్మను గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కల్వకుంట్ల కవితకే దక్కుతుందని, ఖతర్ లండన్ లో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు కవిత హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా కన్వీనర్ సంపత్ గౌడ్, సింగరేణి జాగృతి అధ్యక్షులు వెంకటేష్, జాగృతి జిల్లా నాయకులు ఐద ప్రశాంత్, రత్నాకర్ రెడ్డి, వెంకటేశ్వర్ గౌడ్, మేడి శేఖర్, బొగ్గుల సాయి కృష్ణ, వంశీ, ఈట రాకేష్, వినయ్, మౌనిక్ తదితరులు పాల్గొన్నారు.