రామ్ లీలా మహోత్సవాన్ని విజయవంతం చేయాలి

  • హిందూ ఉత్సవ సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చుంచు రాజ్ కిరణ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2న నస్పూర్ పట్టణంలోని ప్రాణహిత మైదానంలో  సింగరేణి సంస్థ సహకారంతో రామ్ లీలా మహోత్సవ (సప్త వ్యసన దహనం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హిందూ ఉత్సవ సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చుంచు రాజ్ కిరణ్ తెలిపారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రామ్ లీలా మహోత్సవంలో మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయ దశమి అని, పురాణాల ప్రకారం శ్రీరాముడి చేతిలో రావణుడి ఓటమి విజయదశమి నాడే జరిగిందని పేర్కొన్నారు. జూదం, మద్యం సేవించడం, వేట, డబ్బు దుబారా చేయడం, స్త్రీ లోలుపత, మాంసాహారం, దొంగతనం లేదా కఠినంగా మాట్లాడటం వంటి ఏడు చెడు వ్యసనాలను మనిషి వాటిని పూర్తిగా త్యజించి, వాటి ప్రభావం నుంచి బయటపడి మంచి మార్గంలో నడవటమే సప్త వ్యసన దహనం అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి నస్పూర్ అధ్యక్షుడు ఎర్ర తిరుపతి, ఉపాధ్యక్షురాలు దివ్య, ఉపాధ్యక్షుడు తోట వెంకటేష్, నాయకులు కట్కూరి తిరుపతి, బొలిశెట్టి మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
AD 01

Follow Me

images (40)

Leave a Comment