శ్రీరాంపూర్ ఓసీపీలో ఎస్. సి. ఎం. ఎల్.యు (ఐఎన్టీయూసీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఓసీపీలో పిట్ కార్యదర్శి ఓరం జగన్, పిట్ కమిటీ సమన్వయంతో సోమవారం సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్  (ఐఎన్టీయూసీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఇంచార్జ్ జెట్టి శంకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, సభ్యత్వ నమోదులో శ్రీరాంపూర్ ఉపరితల గని కార్మికులు పెద్ద సంఖ్యలో సభ్యత్వం పొందారని, యూనియన్ స్కానర్ ద్వారా సభ్యత్వ రుసుము చెల్లించి స్వచ్ఛందంగా సభ్యులుగా చేరినట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర మంత్రులు, కోల్ బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధుల సమన్వయంతో నిరంతరం కృషి చేస్తున్న ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ కు కార్మికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నాయకులు గరిగ స్వామి, కలవేణి శ్యామ్, తిరుపతి రాజు, జీవన్ జోయల్, శీలం చిన్నయ్య, బ్రాంచ్ నాయకులు, చంద్రమోహన్, లక్ష్మీ నారాయణ, తిరుపతి, గోపతి మల్లేష్, బుద్దె కార్తీక్,  అన్ని షిఫ్ట్ ల కార్యదర్శులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
AD 01

Follow Me

images (40)

Leave a Comment