8
- తెబొగకాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలులో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు విఫలం అయ్యాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆర్.కె 7 గని పై నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ తో కలిసి హాజరై, కార్మికులు, మహిళా కార్మికులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు లాభాల వాటా పంపిణీ విషయంలో కార్మికులకు అన్యాయం చేశాయని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు, పలు పెండింగ్ సమస్యలు పరిష్కారించారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెబొగకాసం సెంట్రల్ జాయింట్ సెక్రటరీ పానుగంటి సత్తయ్య, సెంట్రల్ సెంట్రల్ నాయకులు పెట్టం లక్ష్మణ్, నాయకులు వెంగల కుమారస్వామి, తొంగల రమేష్, చిలుకూరి జగదీష్ కుమార్, మల్లికార్జున్, రవీందర్, బిరుదు శ్రీనివాస్, బానోత్ రాజు నాయక్, పదం శ్రీనివాస్, గంధం గురుమూర్తి, బండారి వంశీకృష్ణ , వెంకటేష్, సంపత్ పిట్ తదితరులు పాల్గొన్నారు.