పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఘనంగా గ్రాండ్‌పేరెంట్స్ డే వేడుకలు

ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

హాజీపూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో శనివారం ‘గ్రాండ్‌పేరెంట్స్ డే’ వేడుకలు అంబరాన్నంటాయి. తరాల మధ్య అనుబంధాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంజేపీటీబీఆర్ ఇంచార్జి ప్రిన్సిపాల్ నాగజ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు తమ తాతామామ్మలతో కలిసి చేసిన సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత తరం, కొత్త తరం కలసికట్టుగా పాల్గొన్న గ్రూప్ యాక్టివిటీస్, ఆటలు, సంగీత, నృత్య ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తమ చేతులతో స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డులు, చిన్న బహుమతులను తమ పెద్దలకు అందించి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో తరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి, కుటుంబ విలువలని కాపాడటానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయి అని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు తమ జీవిత అనుభవాలను, విలువలను విద్యార్థులతో పంచుకొని, వారిని ఆశీర్వదించారు. తమను గౌరవించి, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment