నడిపెల్లి విజిత్ కుమా నేతృత్వంలో దండేపల్లి, నస్పూర్ నాయకులు ఇంటింటికి పర్యటన
‘ఉంగరం’ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: దండేపల్లి మండలంలోని చెల్కగూడ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ చురుకుగా పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆత్రం శాంకరిని గెలిపించాలని కోరుతూ ఆయన సోమవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి ఆత్రం శాంకరికి కేటాయించిన ‘ఉంగరం’ గుర్తుకు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి, ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని విజిత్ కుమార్ కోరారు. ఆత్రం శాంకరి గెలుపుతో చెల్కగూడ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఆత్రం శాంకరి తరఫున ఓటు అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో దండేపల్లి మండల పార్టీ అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ పసర్తి అనీల్, నస్పూర్ పట్టణ అధ్యక్షులు అక్కూరి సుబ్బన్న, పట్టణ కార్యదర్శి మేరుగు పవన్ కుమార్, ఎస్‌సి సెల్ అధ్యక్షులు గరిసె రామస్వామి, పట్టణ ప్రచార కార్యదర్శి ఆకునూరి సంపత్, మాజీ కౌన్సిలర్‌లు వంగ తిరుపతి, అహ్మద్, గరిసె భీమయ్య, పి.జనార్దన్, అమృత రాజకుమార్ తదితర బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





