బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఆవరణలో బహుజన ఆరాధ్య దైవం, మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీరాంపూర్ బ్రాంచ్ సింగరేణి కాలరీస్ బీసీ అండ్ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం అసోసియేషన్ ప్రతినిధులు ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. సామాజిక తత్వవేత్త ఫూలే విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగులకు ఆయన ఆశయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా బీసీ లైసన్ ఆఫీసర్ సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, బ్రాంచ్ కార్యదర్శి బద్రి బుచ్చయ్య, సహాయ కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, ట్రెజరర్ మల్లేష్, జాయింట్ సెక్రటరీ రఘురాం, ఏరియా, పిట్ నాయకులు కొట్టే శ్రీకాంత్, వినోద్, సత్యం, నరేష్, తిరుపతి, సందీప్, నాగేశ్వరరావు, సాంబయ్య, రామచందర్, మధు, బీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.





