పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

కలెక్టర్‌కు విశ్రాంత ఉద్యోగుల వినతి

నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి, వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘం నూతన కార్యవర్గం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు విజ్ఞప్తి చేసింది. సోమవారం రాత్రి వరకు సాగిన బ్యాలెట్ ప్రక్రియలో 2025-2028 సంవత్సరాల కాలపరిమితికి ఎన్నికైన మంచిర్యాల జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్‌ను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు తమను తాము కలెక్టర్‌కు పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రధానంగా విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపుల ఆవశ్యకతను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సంఘం ప్రతినిధులు జిల్లా ట్రెజరీ అధికారి ఎస్. రాజగోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్యలను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. పెన్షనర్ల సమస్యలను వారికి వివరించగా, అధికారులు సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నూతన అధ్యక్షుడు దూస కృష్ణ, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి జగన్, కోశాధికారి పి. పాపారావు, సహ అధ్యక్షుడు కె. నాగేశ్వర్, ఉపాధ్యక్షులు బి. సత్యనారాయణ, బి. రాజమౌళి, కె. సంపూర్ణ, కార్యదర్శులు బి. శంకర్ గౌడ్, కె. వైకుంఠం, సంయుక్త కార్యదర్శులు ఎల్. ప్రేమ్ రావు, కె. మల్లయ్య, నిర్వాహక కార్యదర్శులు పి. తిరుపతి, జె. కైలాసం, పి. సత్తమ్మ, బళ్ళు శంకర్ లింగం, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment