ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతే సింగరేణి ప్రథమ ప్రాధాన్యం

డిజిటల్ హెల్త్ రికార్డులతో వైద్య సేవల్లో పారదర్శకత
శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకే తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 56వ రక్షణ పక్షోత్సవాలలో భాగంగా బుధవారం నస్పూర్ డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన వార్షిక రక్షణ పక్షోత్సవాల వేడుకలను ఆయన రక్షణ వారోత్సవాల ఇన్స్పెక్షన్ కమిటీ కన్వీనర్, డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. వృత్తి సంబంధిత అనారోగ్య సమస్యలను పరిష్కరించడంలోనూ, సకాలంలో వైద్య సేవలు అందించడంలోనూ డిస్పెన్సరీ వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు. సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రతి ఉద్యోగి ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్ హెల్త్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ లో పొందుపరిచినట్లు తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డుల లభ్యత వల్ల ఉద్యోగుల ఆరోగ్య పర్యవేక్షణ, వైద్య పరీక్షలు, నివేదికల జారీ ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా జరుగుతోందని వివరించారు.

  • అవగాహనే రక్షణకు ఆయుధం

అనంతరం ఇన్స్పెక్షన్ కమిటీ కన్వీనర్ డాక్టర్ పి. రమేష్ బాబు మాట్లాడుతూ.. రక్షణ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం కేవలం వేడుకలు జరపడం కాదని, ఉద్యోగుల్లో ఆరోగ్య స్పృహను పెంచడమేనని తెలిపారు. వృత్తి సంబంధిత ప్రమాదాలను నివారించడం, గనుల్లో భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ప్రథమ చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలి, మైనింగ్ సేఫ్టీ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏరియా రక్షణాధికారి విజయ్ కుమార్, ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు పి. హరిశంకర్ రావు, డాక్టర్ పి. శేషగిరి రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్, డాక్టర్ హుస్సేన్, ఇతర వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment