మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఘనంగా సింగరేణి సేవా సమితి 25వ ఆవిర్భావ వేడుకలు
శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్

నస్పూర్, ఆర్.కె న్యూస్: మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి, ఆర్థిక స్వావలంబన సాధించడమే సింగరేణి సేవా సమితి ముఖ్య ఉద్దేశమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. సింగరేణి సేవా సమితి 25వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని ప్రగతి స్టేడియంలోని సిఈఆర్ క్లబ్‌లో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వృత్తి శిక్షణ తరగతులను (టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్) జీఎం శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమరాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటికే అనేకమంది మహిళలు సేవా సమితి ద్వారా ఉచిత శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతుండటం సంతోషకరమన్నారు. మహిళలు ఈ కోర్సులను నేర్చుకోవడంతో సరిపెట్టుకోకుండా, నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని, తద్వారా తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని ఆకాంక్షించారు.

ఆసక్తి ఉంటే మరిన్ని కొత్త కోర్సులు

సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమరాణి మాట్లాడుతూ.. శ్రీరాంపూర్ ఏరియాలో వృత్తి నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఆసక్తి గల మహిళలు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరై మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. మహిళలు ఆసక్తి చూపితే భవిష్యత్తులో మరిన్ని నూతన కోర్సులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, సీనియర్ పీవో ఎస్. సురేందర్, సేవా సెక్రటరీ కొట్టే జ్యోతి, శిక్షకులు, సేవా సభ్యులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment