విశ్రాంత కార్మికులకు లాభాల వాటా ఇవ్వకపోవడం దారుణం

నస్పూర్,  ఆర్.కె న్యూస్:  సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ పొందిన కార్మికులకు చెల్లించాల్సిన లాభాల వాటా, పి.ఎల్.ఆర్ బోనస్‌లను యాజమాన్యం వెంటనే చెల్లించాలని, లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హెచ్చరించింది. మంగళవారం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు బండి రమేష్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ కార్మికులకు లాభాల వాటా, బోనస్ చెల్లించి మూడు నెలలు గడుస్తున్నా, విశ్రాంత కార్మికులను విస్మరించడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ కార్మికుల శ్రమను గౌరవించకుండా, మానవత్వం మరిచి ప్రవర్తించడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం సంస్థకు సంబంధం లేని అంశాలపై కోట్ల రూపాయలను వృధా చేస్తూ, కార్మికులకు న్యాయంగా రావాల్సిన డబ్బును ఆపడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు సూటిగా ప్రశ్నించారు. తక్షణమే విశ్రాంత కార్మికులకు లాభాల వాటా, పిఎల్ఆర్ బోనస్ ప్రకటించాలని, లేనిపక్షంలో రిటైర్డ్ కార్మికులను కలుపుకొని సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని జి.ఎం కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment