పింఛనుదారులను గౌరవించడం సామాజిక బాధ్యత

ఘనంగా జాతీయ పింఛనుదారుల దినోత్సవం
విశ్రాంత ఉద్యోగి తిరుపతిరెడ్డికి సన్మానం

నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రేపటి పింఛనుదారుడేనని, సీనియర్ సిటిజన్లు, పింఛనుదారులను గౌరవించడం ప్రభుత్వాల, సమాజం కనీస బాధ్యతని కలెక్టరేట్ ఏరియా వాకర్స్ హెల్త్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్, ప్రధాన కార్యదర్శి కస్తూరి నాగేశ్వరరావు అన్నారు. జాతీయ పింఛనుదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ ఏరియా వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత అటవీ శాఖ సూపరింటెండెంట్, టీఎన్జీవోస్ మాజీ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు తిరుపతిరెడ్డిని శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించి, ఉద్యోగ బాధ్యతల్లో వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో పింఛనుదారులు గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవనాన్ని సాగించేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నేటి యువతపై ఉందని గుర్తుచేశారు. వారికి అన్ని విధాలా సహకరిస్తూ, వారి హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సిజ్జు, వెంకటేశం, వియాన్, ప్రేమ్, రమేష్ మరియు ఇతర వాకర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment