పెన్షన్ బిక్ష కాదు.. అది హక్కు

ఘనంగా జాతీయ పింఛనుదారుల దినోత్సవం
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

నస్పూర్, ఆర్.కె న్యూస్: ”పెన్షన్ అనేది ప్రభుత్వం వేసే బిక్ష కాదు.. అది పెన్షనర్ల హక్కు” అని సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చిన రోజును పురస్కరించుకుని, మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెన్షన్ భవన్‌లో జాతీయ పింఛనుదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధరం స్వరూప్ నాకరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, 1982 డిసెంబర్ 17న నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.వి. చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడారు. పెన్షనర్ల ఆత్మగౌరవం కోసం న్యాయపోరాటం చేసిన డి.ఎస్. నాకరా, అద్భుతమైన తీర్పునిచ్చిన జస్టిస్ చంద్రచూడ్ సేవలు చిరస్మరణీయమని, వారు యావత్ పెన్షనర్లకు గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, పెన్షనర్ల పట్ల వ్యతిరేక విధానాలను అవలంబించడం శోచనీయమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల జబ్బులకు, అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించేలా హెల్త్ కార్డులను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సహనాన్ని పరీక్షించకుండా, జేఏసీతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. 2024 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి తక్షణమే పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులన్నింటినీ వెంటనే మంజూరు చేయాలని, పెన్షనర్ల సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వేడుకల్లో భాగంగా సీనియర్ పెన్షనర్లు కె. నారాయణ, వి.ఎల్. నరసింహులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పెన్షనర్లు ఒకరికొకరు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షుడు కె. సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కైరం జనార్ధన్, జిల్లా ఉపాధ్యక్షులు బి. సత్యనారాయణ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్, నాయకులు కె. జగదీశ్వర్, ఎన్. రామన్న, కె. హనుమంతరావు, ఆండాలమ్మ, కె. నాగేశ్వర్, కె. వైకుంఠం, పి. పాపారావు, పి. తిరుపతి, బి. రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment