కలెక్టర్ కుమార్ దీపక్ కు అధికారుల ఘన సత్కారం

నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా ముగించినందుకు గాను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను పంచాయతీ రాజ్ శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సారధ్యంలో ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా సాగిందని, ఎక్కడా ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారని అధికారులు కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) డి. వెంకటేశ్వరరావు, డివిజనల్ పంచాయతీ అధికారి కొమ్మెర సతీష్, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు ఎం. మోహన్, ఆర్. మహేందర్, పి. శ్రీనివాస్, ఎన్. రాజేశ్వర్, బి. గంగ మోహన్, ఎంపీఓలు శ్రీపతి బాపన్న, అజ్మత్, బి. శ్రీనివాస్, వి. శ్రీనివాస్, ఎన్. శ్రీనివాస్, ఎం. సత్యనారాయణ, అనిల్ కుమార్, సతీష్ కుమార్, అక్తర్, ప్రసాద్, జలంధర్ తదితరులు పాల్గొని కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment