జనవరి 1న ఉత్తర్వుల పంపిణీ
గడువులోగా ప్రక్రియ పూర్తి చేసిన సిబ్బందికి జీఎం అభినందనలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న 338 మంది ఉద్యోగులకు సర్వీసు లింక్డ్ పదోన్నతుల ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేసినట్లు ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. ఈ పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వుల కాపీలను 2026 జనవరి 1వ తేదీన ఆయా గనుల విభాగాల్లో కార్మికులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియను గడువు కంటే ముందే పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన పర్సనల్ విభాగం ఉద్యోగి కె. శ్రీధర్‌ను శనివారం జీఎం ప్రత్యేకంగా అభినందించి బహుమతిని అందజేశారు. పారదర్శకంగా, వేగంగా పని పూర్తి చేసిన సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, డివై పీఎం ఎం. రాజేష్, సీనియర్ పీవోలు ఎస్. సురేందర్, మురళీ,యు పర్సనల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.





