పెఱిక ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం

రాష్ట్ర కమిటీతో కలిసి పనిచేయాలని ఏకగ్రీవ తీర్మానం

నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ ప్రెస్ క్లబ్ వేదికగా సింగరేణి పెఱిక ఉద్యోగుల సమావేశం ఆదివారం ఇంచార్జి కన్వీనర్ పేరం రమేశ్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి సంస్థలో పనిచేస్తున్న పెఱిక సామాజిక వర్గ ఉద్యోగుల సమస్యలు, వారి సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం, పదోన్నతులు, ఆరోగ్య భద్రత, సామాజిక సమస్యలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర కమిటీకి అనుబంధంగా పనిచేస్తూ, హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాడాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. త్వరలోనే శ్రీరాంపూర్ ఏరియా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి వివరాలను రాష్ట్ర కమిటీకి అందజేయనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో సుమారు 250 మంది ఉద్యోగులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సభ్యులు గోవిందుల రమేష్, బరుపటి మారుతి, బోడకుంట ప్రణయ్ కుమార్, గోపతి మల్లేష్, గొల్ల మహేందర్, కార్కూరి మనోజ్, గోపతి సురేష్, ముద్దసాని కుమారస్వామి, పంచెరపుల నరేష్, ముత్తే సందీప్, కొట్టె శ్రీకాంత్, గొల్ల నాగరాజు, వినయ్ కృష్ణ, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment