ఆటో కార్మికుల ఉదారత… తోటి డ్రైవర్ కుటుంబానికి భరోసా

కృష్ణా కాలనీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నగదు సాయం

నస్పూర్, ఆర్.కె న్యూస్: వృత్తిరీత్యా తామంతా ఒకే కుటుంబమని, తోటి కార్మికుడు ఆపదలో ఉంటే అండగా నిలవడం తమ బాధ్యతని కృష్ణా కాలనీ ఆటో యూనియన్ సభ్యులు నిరూపించారు. స్థానిక కృష్ణా కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ గంగిపెల్లి కుమార్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన పరిస్థితిని గమనించిన తోటి ఆటో డ్రైవర్లు మానవతా దృక్పథంతో స్పందించారు. కృష్ణా కాలనీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం సభ్యులందరూ కలిసి ఐదు వేల రూపాయల నగదును సేకరించి, కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమ వంతు చిన్న సాయం ఆయన కుటుంబానికి కొంత ఊరటనిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా కాలనీ ఆటో యూనియన్ అధ్యక్షులు రాగిడి రాజు, గౌరవాధ్యక్షులు పులి భీమయ్య, ఉపాధ్యక్షులు ఎనగందుల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి శ్రీను, కోశాధికారి బొబ్బల కుమార్, యూనియన్ నాయకులు నూకల భాస్కర్, రజాక్, కందుల రమేష్, బొబ్బల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment