అక్రమ రవాణా, మత్తు పదార్థాల కట్టడికి పోలీసుల నాకాబందీ

నేరాల నియంత్రణే లక్ష్యం: నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు
మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్

నస్పూర్, ఆర్.కె న్యూస్: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు (నాకాబందీ) నిర్వహించారు. మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో సీసీసీ నస్పూర్ పరిధిలోని తోళ్లవాగు వద్ద జాతీయ రహదారిపై వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలను నివారించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనదారులపై, మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై, హెల్మెట్ లేని వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీసీసీ నస్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ యు. ఉపేందర్ రావు, ఎస్సై జితేందర్ సింగ్, ఏఎస్సై శకుంతల, హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, కానిస్టేబుళ్లు సతీష్, చంద్రమౌళి, అశోక్, మల్లేష్, వనిత, వాణిశ్రీ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment