ఈనెల 9న సింగరేణి విశ్రాంత ఉద్యోగుల మహా ఆత్మీయ సమ్మేళనం

కనీస పెన్షన్ రూ.15 వేలు చెల్లించాలి: జిల్లా అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య

నస్పూర్, ఆర్.కె న్యూస్: ఈనెల 9న నస్పూర్ పట్టణంలోని సింగరేణి గార్డెన్స్‌లో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల మహా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య వెల్లడించారు. నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమ్మేళనానికి సీఎంపీఎఫ్ గోదావరిఖని రీజినల్ కమిషనర్-1 భరత్ కుమార్, రీజినల్ కమిషనర్-2 డాక్టర్ గోవర్ధన్, శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్, డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్ అతిథులుగా హాజరవుతారని తెలిపారు. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ వేదిక ద్వారా సమస్యలపై చర్చించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థలో 35 నుంచి 45 సంవత్సరాల పాటు సేవలందించిన సుమారు 16,900 మంది విశ్రాంత ఉద్యోగులు కేవలం రూ. 350 నుంచి రూ.1,000 వరకు మాత్రమే పెన్షన్ పొందుతూ తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో దినసరి కూలీలుగా, వ్యవసాయ పనులకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా పెన్షన్ పెంపు లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కోల్ బెల్ట్ ప్రజాప్రతినిధులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజాప్రతినిధులకు ఇస్తున్న డబుల్ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ 15,000 రూపాయలు చెల్లించాలని, సీపీఆర్‌ఎంఎస్ మెడికల్ కార్డు పరిమితిని రూ. 25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను అర్హులైన విశ్రాంత కార్మికులకు కేటాయించాలని, అన్ని బ్యాంకులు రూ. 30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం వర్తింపజేసేలా చొరవ చూపాలని కోరారు. సీఎంపీఎఫ్ ట్రస్ట్ బోర్డులో జరిగిన నిధుల అవకతవకలపై జాతీయ కార్మిక సంఘాలు మౌనం వీడాలని, పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు రాళ్లబండి రాజన్న, పూదరి నర్సయ్య, నల్లగొండ సదాశివాచారి, బింగి రాజేశం, లక్ష్మణ్, బి. కృష్ణ, లక్ష్మీనారాయణ, వెంకటరత్నం, జ్ఞాని, సాయిలు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment