జనగణనలో ఓబీసీ కాలమ్‌తో పాటు యూనిక్ కోడ్ కేటాయించాలి

సీసీసీ కార్నర్‌లో బీసీ హక్కుల పోరాట సమితి నిరసన

నస్పూర్, ఆర్.కె న్యూస్: కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే దేశవ్యాప్త జనగణనలో వెంటనే ఓబీసీ కాలమ్‌ను చేర్చి, ప్రతి కులానికి ఒక ప్రత్యేక యూనిక్ కోడ్‌ను కేటాయించాలి” అని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం నస్పూర్ మండల కేంద్రంలోని సీసీసీ కార్నర్ వద్ద సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకులు 1931లోనే బీసీ కులగణన చేపడితే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా నేటికీ కులగణన చేపట్టకపోవడం బీసీ వర్గాలపై తీవ్ర వివక్ష చూపడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాల ఒత్తిడితో ఇప్పటికే 10 రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించినా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పార్లమెంట్ సాక్షిగా కులగణనపై హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు మాట తప్పడం బీసీలను మోసం చేయడమేనని విమర్శించారు. చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనే దురుద్దేశంతోనే కేంద్ర పాలకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంపై ప్రధాన ప్రతిపక్షమైన ఇండియా కూటమి సైతం తీవ్ర ఒత్తిడి తేవాలని కోరారు. తక్షణమే జనగణనలో ఓబీసీ కాలమ్ పొందుపరచకపోతే దేశవ్యాప్తంగా బీసీ సమాజం తరఫున ఉద్యమాలను తీవ్రతరం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కంచర్ల సదానందం, నాయకులు అశోక వేముల, పెద్దల చంద్రకాంత్, దేవసాని నాగరాజు, ఎండీ లతీఫ్, తంగళ్లపల్లి బాపు, వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment