🔴 32వ డివిజన్ నుంచి పార్టీలో చేరిన యువత
🔵 కండువా కప్పి ఆహ్వానించిన కొక్కిరాల సురేఖ
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందిని జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్‌కు చెందిన పలువురు యువ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాయకుడు ధర్ని మధుకర్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది యువకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కొక్కిరాల సురేఖ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కొంగల నరసింహారెడ్డి, బేర రవి, బేర రాము, బేర లక్షణ్, గోపతి సతీష్, సుధాకర్ రావు, అజయ్, అరుణ్ కుమార్ సహా ఇతర యువకులు రాము. నియోజకవర్గంలో జరుగుతున్న మార్పును చూసి యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభపరిణామమని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా కాంగ్రెస్ బలోపేతం అవుతోంది. కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే నాయకత్వాన్ని ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారని కొక్కిరాల సురేఖ పేర్కొన్నారు.







