- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్ (గాంధీ నగర్) కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కొక్కిరాల సురేఖ తెలిపారు. ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని వివరించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో తామంతా భాగస్వాములమవుతామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ చూపుతున్న చొరవ తమను ఎంతగానో ప్రభావితం చేసిందని వెల్లడించారు.







