ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 3,3ఏ గనిలో బదిలీ వర్కర్ గా పని చేస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన కాదాసి దుర్గా ప్రసాద్ భార్యకు ఉద్యోగుల సామాజిక సంక్షేమ నిధి కింద గని ఉద్యోగుల నుంచి రికవరీ చేయబడిన 62,250 రూపాయల చెక్కును గని మేనేజర్ వెంకట్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సార్పీ 3,3ఏ గని మేనేజర్ మాట్లాడుతూ మరణించిన ఉద్యోగి కుటుంబం కోసం స్వచ్ఛందంగా సామాజిక సంక్షేమ నిధి మొత్తాన్ని అందిస్తున్నందుకు ఉద్యోగులను అభినందించారు. మృతుని కుటుంబానికి కంపెనీ నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ త్వరగా అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి ఎండీ గౌస్ పాషా, రక్షణాధికారి జి. శ్రీధర్, గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి మురళీ చౌదరి, అధికారులు కామేశ్వర్ రావు, అరుణ్ కుమార్, రాకేష్ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
• గుర్తింపు కార్మిక సంఘం నాయకులు
ఆర్.కె న్యూస్, నస్పూర్: కార్మికులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలం అవుతుందని గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముసుకే సమ్మయ్య శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదాలు అన్నారు. గుర్తింపు కార్మిక సంఘం నాయకులు బుధవారం ఆర్.కె 5 గనిని సందర్శించి, వివిధ డిపార్ట్మెంట్ల కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుర్తింపు కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ సంస్థకు సంబంధించిన వేల కోట్ల రూపాయలను రాష్ట్రంలోని పలు జిల్లాలకు సిఎస్ఆర్, డి.ఎం.ఎఫ్.టి నిధుల పేరుతో ధారాదత్తం చేస్తున్న యాజమాన్యం కార్మికులకు కనీసం రెస్ట్ హాల్, కబోర్డ్స్ సమకూర్చే పరిస్థితుల్లో లేదన్నారు. ఆర్.కె 5 గనిలో కార్మికుల రెస్ట్ హాల్స్ అధ్వానంగా ఉన్నాయని, వర్షం కురిస్తే రెస్ట్ హాళ్లలో నీళ్లు వస్తున్నాయన్నారు. కార్మికులకు నాసిరకమైన బూట్లు, డ్రిల్ బిట్లు సరఫరా చేస్తున్నారన్నారు. గనిలో వెంటిలేషన్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, ఫిట్ సహాయ కార్యదర్శి లక్కిరెడ్డి సత్తిరెడ్డి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్, ట్రేడ్స్ మేన్స్ నాయకులు సురేష్, నాయకులు మల్లేష్, జిపి రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో భాగంగా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సిసిసి కార్నర్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అనే నిదానంతో బహుజనులందరూ ఐక్యతతో కలిసి ఉండాలని, కొంత మంది రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నాలు అడ్డుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం నస్పూర్ పట్టణ అధ్యక్షులు గోశిక మనోజ్ కుమార్, కోర్ కమిటీ సభ్యులు గరిసె రామస్వామి, జువ్వాజి నందయ్య, దమ్మర్ల పెద్దమ్మయ్య, బాబురావు, ప్రచార కార్యదర్శి పండుగ శ్రీనివాస్, సుర్మిళ్ళ కిరణ్, భోగి నరహరి, బందెల సురేందర్, పీక శ్రావణ్, పండుగ శ్రీధర్, రాజ్ కుమార్, సుమన్, సోను, రిషి, దొంతమల్ల ప్రేమ్ సాయి, సంధి కృపాకర్, కిషోర్, వంజరి అభి తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 3&3ఏ గని మేనేజర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వెంకట్ రావు ను మంగళవారం గని పిట్ కార్యదర్శి కాంపెల్లి తిరుపతి ఆధ్వర్యంలో బిఎంఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎస్సార్పీ 3&3ఏ గని మేనేజర్ ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛము అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి.ఎం.కె.ఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి, సెంట్రల్ సెక్రెటరీ రాగం రాజేందర్, ఏరియా జాయింట్ సెక్రటరీ భోంపల్లి రమేష్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రాజేష్, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, చల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: జిల్లా మహిళా సాధికారత కేంద్రం వారు బేటి బచావో బేటి పడావో పథకం, బాలికలు, మహిళల సంరక్షణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మంగళవారం నస్పూర్ పట్టణంలోని ఎయిమ్స్ హై స్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ విజయ, ఆర్థిక అక్షరాస్యత నిపుణురాలు లిప్సికలు పాల్గొని మాట్లాడుతూ, బేటి బచావో బేటి పడావో పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విదివిధానాలు విద్యార్థులకు వివరించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టం, లింగ సమానత్వం, బాల్యవివాహాల నిరోధక చట్టం, ఆన్లైన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, సుకన్య సమృద్ధి యోజన, మిషన్ వాత్సల్య, ఆడపిల్లల ప్రాముఖ్యత, మహిళా సాధికారత, పోక్సో యాక్ట్, డిజిటల్ ఎడ్యుకేషన్, మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 1930, సఖి సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, పోలీస్ హెల్ప్ లైన్ 100, సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ నెంబర్ 14567, నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ 112, హెల్ప్ లైన్ నెంబర్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మైదం రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, మందమర్రి: మందమర్రి ఏరియా నూతన జీఎంగా బాధ్యతలు స్వీకరించిన జి. దేవేందర్ ను ఏరియా డబ్ల్యూ.పి.ఎస్ అండ్ జి.ఏ క్రీడాకారులు, కళాకారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జీఎంను శాలువాతో సన్మానించి మొక్కను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్, క్రీడల సమన్వయకర్త రవికుమార్, జనరల్ కెప్టెన్ టి. చిన్నయ్య, క్రీడల కెప్టెన్లు ,సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారినిలు,కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను మంగళవారం నస్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సిసిసి కార్నర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ 40 ఏళ్ళ వయస్సులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, ఆయన హయాంలోనే దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికాం విప్లవానికి పునాదులు పడ్డాయని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం పాటుపడుతూ, కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తన వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ళ వేణు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి సుధాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: స్థానిక తాళ్ళపల్లి ప్లాట్స్ లోని మదర్స్ ప్రైడ్ ప్లే స్కూల్ లో శనివారం ముందస్తు రక్షా బంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిసిసి నస్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ సుగుణాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సిసిసి నస్పూర్ సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బందికి రాఖీ కట్టి మేము మీకు రక్ష మీరు మాకు రక్ష అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదర్స్ ప్రైడ్ ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ డి. రామకృష్ణ రెడ్డి, ఎస్ఆర్ఆర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ రేగళ్ళ ఉపేందర్, ఉపాధ్యాయులు స్వదీప్తి, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- 35 శాతం లాభాల వాటా చెల్లించాలి
- ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
- ఏఐటీయూసీలో చేరికలు
ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన 27 వేల కోట్ల రూపాయల బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు, వేజ్ బోర్డు శాశ్వత సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శుక్రవారం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఉపరితల గనిలో ఏర్పాటు చేసిన ద్వార సమావేశానికి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేస్తుందన్నారు. సింగరేణి యాజమాన్యం సంస్థ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలకు మళ్లించకుండా, కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలన్నారు. గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించి, లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని కోరారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులందరికీ రెండు గుంటల ఇంటి స్థలం, 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పించాలన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సింగరేణి సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, నూతన బొగ్గు బావులు ఏర్పాటు చేయాలన్నారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అని చెప్పే సింగరేణి యాజమాన్యం పెరిక్స్ పై ఆదాయపు పన్ను అధికారులకు యాజమాన్యమే చెల్లిస్తుందని, కానీ కార్మికులకు ఎందుకు చెల్లించడం లేదని సందర్భంగా ప్రశ్నించారు. ఉపరితల గనిలో నూతన యంత్రాలు కొనుగోలు చేయాలన్నారు. అనంతరం పలు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు సీతారామయ్య సమక్షంలో ఏఐటీయూసీలో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, బ్రాంచ్ సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, జీఎం చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య, మారుపెల్లి బాబు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, గునిగంటి నరసింగా రావు, ఫిట్ సహాయ కార్యదర్శి నల్ల సత్తయ్య, నాయకులు మోహన్ రెడ్డి, ఆళ్ల వెంకటరెడ్డి, శంకర్, బానోత్ సరోజ, మైనింగ్ స్టాప్ నాయకులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీగా నస్పూర్ పట్టణానికి చెందిన శ్రీపతి రాములు గౌడ్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు రాజేష్ యాదవ్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నేషనల్ చైర్మన్ మహమ్మద్ యాసిన్ ల ఆదేశాల మేరకు నియామక పత్రం అందించామన్నారు. ఈ సందర్భంగా శ్రీపతి రాములు గౌడ్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు రాజేష్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డికి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ నేషనల్ చైర్మన్ మొహమ్మద్ యాసిన్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ నియమ, నిబంధనలు పాటిస్తూ, సంస్థ లక్ష్యాల కోసం పని చేస్తానని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తానని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తానని, ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని, పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు.



