వేమనపల్లి, ఆర్.కె న్యూస్: నీల్వాయి నూతన ఎస్సైగా జగదీశ్వర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజలకు ఏ అవసరం ఉన్న నేరుగా వచ్చి తమను కలవచ్చని ఆయన పేర్కొన్నారు.
KYATHAM RAJESH
రామకృష్ణాపూర్, ఆర్.కె న్యూస్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రేపు జాతీయ ఏక్తా దివాస్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ పోలీసులు “రన్ ఫర్ యూనిటీ” (2కే రన్)ను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఠాగూర్ స్టేడియం నుంచి రామాలయం ఏరియా వరకు 2కే రన్ జరుగుతుంది. పటేల్ ఆశయాలను స్మరించుకుంటూ, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పట్టణ ఎస్సై రాజశేఖర్ పిలుపునిచ్చారు.
- చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
- మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రతి పౌరుడు ఒక పోలీసే అని, సంఘ విద్రోహ శక్తులు, అనుమానిత వ్యక్తుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా సీసీసీ కార్నర్ నుంచి మంచిర్యాల ఐబీ చౌరస్తా వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ మాట్లాడుతూ, పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తారని, విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసుల సేవలను స్మరించుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల త్యాగాలు, సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్ రావు, వేణు చందర్, నరేష్ కుమార్, సత్యనారాయణ, బన్సీలాల్, ఎస్సైలు యు. ఉపేందర్ రావు, సంతోష్ కుమార్, తిరుపతి, రాజశేఖర్, సురేష్, తహసీనోద్దీన్, పోలీస్ సిబ్బంది, ఎన్ జీ ఓ ప్రతినిధులు, భవన కార్మిక సంఘం నాయకులు, స్థానిక యువత, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- తెబొగకాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి
- ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు పోరాటం చేస్తామని ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఇంచార్జ్ జెట్టి శంకర్ రావు అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 5 గని పై కేంద్ర కార్యదర్శలు పిన్నింటి మల్లారెడ్డి, రామకృష్ణ, పిట్ కమిటీ సమన్వయంతో బుధవారం సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఇంచార్జ్ జెట్టి శంకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, ఆర్.కె 5 గని కార్మికులు పెద్ద సంఖ్యలో సభ్యత్వం పొందారని, యూనియన్ స్కానర్ ద్వారా సభ్యత్వ రుసుము చెల్లించి స్వచ్ఛందంగా సభ్యులుగా చేరినట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల హక్కులు సాధించడమే తమ యూనియన్ లక్ష్యమని, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ నాయకత్వంలో సింగరేణిలో పేరుకుపోయిన అనేక సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపుదిద్దుకుంటుందని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా గుర్తింపు సంఘం కార్మికుల కోసం ఎలాంటి విధివిధానాలు చేపట్టలేదని ఆరోపించారు. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం ఐఎన్టీయూసీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర నాయకులు గరిగే స్వామి, తిరుపతి రాజు, ఏనుగు రవీందర్ రెడ్డి, పిన్నింటి మల్లారెడ్డి, రామకృష్ణ, శ్రీనివాసరావు, మహేందర్ రెడ్డి, పెద్దిరాజు, శ్రీధర్ల మల్లేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు నలిమెల మహేష్ వర్మ
శ్రీరాంపూర్ ఓసీపీలో ఎస్. సి. ఎం. ఎల్.యు (ఐఎన్టీయూసీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం
- ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి
ఆర్ . కె న్యూస్, నస్పూర్: సింగరేణి సెక్యూరిటీ విభాగానికి వాసాల కనకయ్య అందించిన సేవలు మరువలేనివని శ్రీరాంపూర్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ అండ్ పిసి సెక్యూరిటీ కార్యాలయ ప్రాంగణంలో పదవీ విరమణ పొందిన సెక్యూరిటీ విభాగం జమ్మేదార్ వాసాల కనకయ్యను ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్, పర్మినెంట్, ప్రైవేట్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మాట్లాడుతూ, వృత్తిరీత్యా కనకయ్య క్రమశిక్షణతో విధులు నిర్వహించేవారని, సెక్యూరిటీ విభాగానికి ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. వాసాల కనకయ్య ను ఆదర్శంగా తీసుకొని సెక్యూరిటీ ఉద్యోగులు క్రమశిక్షణతో బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఇన్స్పెక్టర్ సిర్ర రాజయ్య, జమ్మేదారులు, పర్మినెంట్, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
- గుండెపోటు నివారణ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి
- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- ఏఐటీయూసీ నాయకులు



