- ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి
- ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం


నస్పూర్, ఆర్.కె న్యూస్: టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ బోర్డు ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలోని శ్రీ సిద్ధి వినాయక గణేశ్ మండలి వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు పర్యావరణహితంగా నిర్వహిస్తున్నారు. సొసైటీ సొంత స్థలంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణలో తయారు చేసిన ప్రత్యేక బంక మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన కుంకుమ పూజకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మొదటిసారి గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని, త్వరలోనే ఇదే స్థలంలో అందరి సలహా మేరకు ఆలయాన్ని నిర్మిస్తామని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహక అధ్యక్షుడు, పర్యావరణ వేత్త, మట్టి విగ్రహ దాత గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ అన్నదానం, ప్రసాద వితరణ, పూజలు, స్టీలు పళ్ళాలు, గ్లాసులు, ఆకు దొప్పలు వినియోగిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గణపతి మండపం ఆవరణలో పచ్చని మొక్కలు ఏర్పాటు చేసామని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హబీబ్, రామ్మోహన్, పొన్న మల్లయ్య, మొండయ్య, నాగేశ్వర్, శ్రీపతి బాపురావు, సలహాదారులు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మంచిర్యాల 01 ప్రిన్సిపాల్ సంజీవ్, 02 ప్రిన్సిపాల్ ఆయుబ్, లక్షెట్టిపేట స్కూల్ ప్రిన్సిపాల్ అశ్వినిలు ద్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న రోజుల్లో శారీరక శ్రమ లేదని, ఆటల ద్వారా దృఢంగా ఉంటారని తెలిపారు. శుక్రవారం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పిఈటిలు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

ఆర్.కె న్యూస్, నస్పూర్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నస్పూర్ పట్టణంలోని శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద అర్చకులు సముద్రాల వెంకట రమణాచార్యుల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుంకుమార్చన పూజలో మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని శ్రీలక్ష్మి గణేష్ మండలి కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి తిరోక్క పూలు, నైవేద్యం సమర్పించి భక్తితో కొలుస్తున్నారు. గణపతి బప్పా మోరియా, గణేష్ మహారాజ్ కి జై అనే భక్తుల నినాదాలతో గణేష్ మండపం పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అనుమాండ్ల వెంకట్ రెడ్డి, జక్కినబోయిన గోపాల్, రామగిరి బాలరాజు, క్యాతం రాజేష్, కాటం రామ్ రెడ్డి, టేకుమట్ల అంజయ్య, మండల తిరుపతి, తిరుపతి గౌడ్, రాయమల్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎస్.పి ఏసీ ఫంక్షన్ హాల్ ను మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల సురేఖ శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ యజమానులు సూరపనేని శ్రీనివాస రావు, పోరెడ్డి లక్ష్మా రెడ్డి, భీంరెడ్డి రవీందర్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫంక్షన్ హాల్ యజమానులు మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుమిల్ల వేణు, కాంగ్రెస్ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఇతర పరిశ్రమల నుంచి బొగ్గు తక్కువ ధరలో లభిస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని ఎండీటీ బృంద కన్వీనర్ జి.రవికుమార్ (ఏజెంట్ ఎస్సార్పీ గ్రూప్) అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూ టెక్ గనిపై మేనేజర్ కురుపాటి శ్రీనివాసులు అధ్యక్షతన మల్టీ డిపార్టుమెంటల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎండీటీ బృంద సభ్యులు సాంబశివరావు (డీజీఎం, ఈ అండ్ ఎం),కె. అమర్నాథ్ (అడిషనల్ మేనేజర్, ఆర్ అండ్ డి ), వి. మహేష్ (అడిషనల్ మేనేజర్, ఎస్టేట్స్), జి. నరేష్ (డీవై ఎఫ్ఎం), వి. దేవేందర్ రెడ్డి (డీవై పీఎం) హాజరయ్యారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సింగరేణి ఆర్థిక స్థితిగతులు, సంస్థ ప్రగతిలో ఉద్యోగుల పాత్రపై ఆయా విభాగాల అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎండీటీ బృంద కన్వీనర్ జి.రవికుమార్ మాట్లాడుతూ, బొగ్గు ఉత్పత్తితో పాటు ఉత్పాదకత పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. యువ ఉద్యోగులు కంపెనీ నాది అనే భావనతో పని చేయాలని తెలిపారు. ప్రతిరోజు తప్పకుండా విధులకు హాజరు కావాలని, గైర్హాజరు లేకుండా చూడాలని పేర్కొన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించేందుకు దృష్టి సారించాలన్నారు. భూగర్భ గనుల్లో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి అధికోత్పత్తి సాధించాలని, అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు సమన్వయంతో పని చేసినప్పుడే సంస్థ ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గని మేనేజర్ కురుపాటి శ్రీనివాసులు, గుర్తింపు సంఘం ఏరియా సహాయ కార్యదర్శి మోతుకూరి కొమురయ్య, గని రక్షణాధికారి కొట్టె రమేష్, పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, సీనియర్ సంక్షేమాధికారి పాల్ సృజన్, ఇంజనీర్ కృష్ణ, వెంటిలేషన్ అధికారి చంద్రమౌళి, అండర్ మేనేజర్ పరమేశ్వర్, ఇతర అధికారులు, నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఈ నెల 20 నుంచి 22 వరకు మేడ్చల్ జిల్లాలో జరుగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ నస్పూర్ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక నర్సయ్య భవన్ లో రాష్ట్ర 4వ మహాసభ గోడ పత్రికలను సిపిఐ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నస్పూర్ మండల కార్యదర్శి మాట్లాడుతూ, ఈ మహాసభలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి. రాజా, జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణలు హాజరవుతారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు బడా కార్పొరేట్లకు కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ ప్రజలపై అధిక భారాన్ని మోపుతోందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి లింగం రవి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మిర్యాల రాజేశ్వరరావు, దొడ్డిపట్ల రవీందర్, పూజారి రామన్న, ఇలవేణి సారంగపాణి, బిసి సాధన సమితి మండల అధ్యక్ష, కార్యదర్శులు జోగుల ఆంజనేయులు, బొడ్డు లచ్చన్న, నాయకులు అల్లా లచ్చిరెడ్డి, నాగపురి సమ్మయ్య, ఎండి. రషీద్ తదితరులు పాల్గొన్నారు.