– జాతీయ నాయకుల వేషధారణతో సందడి చేసిన చిన్నారులు
జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కోటపల్లి మండలం పారుపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం వైవిధ్యంగా, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్ టీచర్ సంతోష్ మార్గదర్శనంలో విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయాలు, పల్లె జీవనం, అల్లూరి సీతారామరాజు, కొమురం భీం, ఝాన్సీ లక్ష్మీబాయి, పల్లెటూరి మహిళ, ఉపాధ్యాయుడు, భరతమాత, డాక్టర్, రైతు, పురోహితుడు, పారుపెల్లి మహిళ, సంప్రదాయ స్త్రీ, తదితర ప్రత్యేక వేషధారణతో సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గుండేటి యోగేశ్వర్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలతో అలంకరించారు. చాచా నెహ్రూ జీవిత విశేషాలు విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులతో కలిసి.హెం.ఎం, ఉపాధ్యాయులు మహనీయుల డైలాగ్స్ వినిపించి సందడి చేశారు. మహనీయుల డైలాగ్స్ తో ప్రాంగణమంతా కళాకాంతులతో అలరించింది. కార్యక్రమంలో విద్యార్థులు చక్కటి హావభావాలను ప్రకటిస్తూ పాత్రాభినయం చేసి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులకు హెచ్ .ఎం.బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొగాకు వెంకటేశ్వర్, బి. బిక్కు, ఏ.సతీష్ కుమార్, బిక్కు, నర్సింగ్, విలాస్ జాదవ్, సంతోష్, కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని మంచిర్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ సతీమణి స్రవంతి అన్నారు. మంగళవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఝాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి వెరబెల్లి రఘునాథ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా వెరబెల్లి స్రవంతి రఘునాథ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే డబల్ ఇంజిన్ సర్కార్ తోనే సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఈర్ల సదానందం, పానుగంటి మధు, మిట్టపల్లి మొగిలి, కొండా వెంకటేష్, పాషా, బద్రి శ్రీకాంత్, కుర్రే చక్రి, తాడూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయలో బాలల దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్, డ్రామా, డాన్స్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. వివిధ వేషధారణలో ఉన్న విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. తదుపరి పాఠశాల ప్రిన్సిపాల్ జె. ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు నవంబర్ 14ను బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారని అన్నారు. నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టమని, పిల్లలు ఆయనను చాచా నెహ్రూ అని పిలిచేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె-6 గని కారుణ్య నియామక దరఖాస్తులకు కావాల్సిన వివరాలు:
1. అన్ ఫిట్ లెటర్ మరియు జీతం చిట్టి.
2. కుటుంబ సభ్యుల (భార్య, కుమారులు, కుమార్తెలు) పేర్లు, వయస్సు, చదువు, వృత్తి, సెల్ నెంబర్లు.
3. ఇద్దరు సాక్షుల జీతం చిట్టి జిరాక్స్ మరియు సెల్ నెంబర్లు.
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు (ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో రెన్యువల్ చేయాల్సిన) లైఫ్ సర్టిఫికెట్ మరియు హెల్త్ కార్డు రెన్యువల్ సౌకర్యం కలదు.
కావాల్సిన డాకుమెంట్స్:
1. PPO నెంబర్
2. బ్యాంక్ అకౌంట్ నెంబర్
3. హెల్త్ కార్డు నెంబర్
4. ఆధార్ కార్డు
5. మొబైల్ నెంబర్
మీకు కావలసిన అన్ని రకాల ఆన్ లైన్ సేవలు ఒకే చోట:
డిటిపి, కలర్ జిరాక్స్, లామినేషన్, ఇంటర్నెట్, ఆన్ లైన్ అప్లికేషన్స్, పాన్ కార్డ్ సర్వీస్, క్యాష్ విత్ డ్రా, మనీ ట్రాన్స్ ఫర్, ఆధార్ డౌన్ లోడ్, పివిసి ఐడి కార్డ్స్, జీవన్ ప్రమాన్ (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్), ఐటి రిటర్న్స్ ఈ-ఫైలింగ్, నోటరీ, స్టాంప్ (బాండ్) పేపర్స్ లభించును, వెహికిల్ ఇన్సూరెన్స్, వాయిస్ ఓవర్ సర్వీస్, బస్ & ట్రైన్ టికెట్ బుకింగ్, స్పైరల్ బైండింగ్, Paytm KYC.
కస్టమర్లకు గమనిక: మీకు ప్రూఫ్ ఇచ్చిన డాక్యుమెంట్ ను ఒకటికి రెండు సార్లు సరి చూసుకోగలరు. ప్రూఫ్ చూసుకున్న తర్వాత వచ్చు తప్పులకు మా బాధ్యత లేదు, ఎటువంటి వాదనలకు తావు లేదు.


– మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ1 గని వద్ద మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, కారుణ్య నియామకాలతో కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారని కోరారు. సింగరేణి కార్మికులందరూ కారు గుర్తుకే ఓటు వేయాలని, తనని మరోసారి ఎమ్మెల్యేగా దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, మల్లా రెడ్డి, ఢీకొండ అన్నయ్య, పెట్టెం లక్ష్మణ్, ఎంబడి తిరుపతి, రౌతు సత్యనారాయణ, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
– నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను
– మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్
భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన ఓటు హక్కు ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, ఈ నెల 30న జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ రోజున అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన ” నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను (ఐ ఓట్ ఫర్ షూర్) ” ప్రదర్శన బోర్డును స్వయంగా ఫొటో దిగి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలోని 3 నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, అర్హత గల ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని 100 శాతం పోలింగ్ జరిగేలా సహకరించాలని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవచ్చని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని 002 – చెన్నూర్ (ఎస్.సి.) నియోజకవర్గంలో 227, 003-బెల్లంపల్లి (ఎస్.సి.) నియోజకవర్గంలో 227, 004-మంచిర్యాల నియోజకవర్గంలో 287 మొత్తంగా 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులు, 80 సం॥ల వయస్సు పైబడిన వయోవృద్ధులు, గర్భిణుల కొరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో వీల్ ఛైర్, ర్యాంపు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 1 వేయి 500 మందికి ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేసి ఓటర్లకు తమ నివాసం సమీపంలోనే పోలింగ్ ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం ఈసారి ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం జరిగిందని, వయోవృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్ళేందుకు తగు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా, నిస్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. రైల్వే స్టేషన్లు, ఆర్.టి.సి. బస్టాండ్లు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలలో ఈ ప్రదర్శన బోర్డులను ఉంచడం జరుగుతుందని, అధికారులు, ఉద్యోగులు, యువత ఫొటో దిగి వాట్సాప్ డిస్ప్లే, ఇతర సోషల్ మీడియాలో స్టేటస్ ద్వారా ఈ నెల 30వ తేదీన ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా పౌర సంబంధాల అధికారి వై.సంపత్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

– జైపూర్ ఏసీపీ మోహన్
– అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫ్లాగ్ మార్చ్
ఈ నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును ఎలాంటి భయాందోళనకు లోనుకాకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జైపూర్ ఏసీపీ మోహన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రజలలో భరోసా కల్పించేందుకు సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సర్కిల్ పోలీసులు శ్రీరాంపూర్ బస్ స్టాండ్ నుండి ప్రగతి స్టేడియం, కటిక దుకాణాలు, హిమ్మత్ నగర్, కొత్త రోడ్ మీదుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జైపూర్ ఏసీపీ మోహన్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రజలలో నమ్మకం కలిగించేందుకు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పోలింగ్ రోజున సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కవాతులో శ్రీరాంపూర్ సీఐ రమేష్ బాబు, శ్రీరాంపూర్ ఎస్సై రాజేష్, జైపూర్ ఎస్సై ఉపేందర్ రావు, భీమారం ఎస్సై రాజవర్ధన్, శ్రీరాంపూర్ సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. భార్య సురేఖ, సోదరుడు సత్యపాల్ రావు, కుమారుడు చరణ్ రావు, కోడలు శైలజ లతో కలిసి మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి(ఆర్డీవో) రాములుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ప్రేమ్ సాగర్ రావు నివాసం నుంచి ఐబీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, మహిళల కోలాటాలు, రెపరెపలాడిన కాంగ్రెస్ జెండాలు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. తనకు టికెట్ కేటాయించిన పార్టీ అధిష్టానానికి ప్రేమ్ సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రజల్లో నిరంతరం తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు ఎమ్మార్పీ ధరకు రెమిడీసివిర్ ఇంజక్షన్ ఇప్పించి ప్రాణాలు కాపాడినట్లు చెప్పారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసినట్లు తెలిపారు. బతుకమ్మ, రంజాన్ పండుగ కానుకలుగా మహిళలకు చీరలు పంపిణీ చేశామన్నారు. అధికారం లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేశామని ప్రజలు తప్పకుండా ఆదరించి గెలిపిస్తారని ప్రేమ్ సాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ర్యాలీలో మిత్రపక్షమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, పట్టణ కార్యదర్శి ఖలందర్ ఖాన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి సోదరుడు గడ్డం అచ్యుతం రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని శ్రీరాంపూర్ సీఐ రమేష్ బాబు, శ్రీరాంపూర్ ఎస్సై రాజేశ్ అన్నారు. బుధవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హిమ్మత్ నగర్ లో కాలనీ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీరాంపూర్ సీఐ, ఎస్సైలు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎలాంటి విభేదాలు తలెత్తకుండా ప్రచారం చేసుకోవాలని సూచించారు. అల్లర్లకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలకు లోబడి నడుచుకోవాలన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని, ఎన్నికలకు సంబంధించిన ర్యాలీ, సభలు, వెహికల్, మైక్ పర్మిషన్ లకు సువిధ యాప్ ద్వారా ఆన్ లైన్ లో అనుమతులు తీసుకోవాలన్నారు. 50 వేల రూపాయల కన్నా ఎక్కువ మొత్తంతో ప్రయాణం చేస్తే తగిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా,సజావుగా జరగడానికి పోలీస్ వారికి సహకరించాలని కోరారు.
:: జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ::
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన ఉక్కుమనిషి, దేశ ప్రజలంతా ఒక్కటేనని, మనం భారతీయులమనే భావన తీసుకువచ్చి ప్రజలందరినీ ఏకతాటిపై నిలిపిన మహా మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ సమైఖ్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రీయ విద్యాలయం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తా నుండి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు తలపెట్టిన 2కె రన్ కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని, స్వాతంత్య్రం అనంతరం దేశంలోని అనేక సంస్థానాలను విలీనం చేశారని, అదే సమయంలో నిజాం సర్కార్ పాలిస్తున్న హైదరాబాద్ సంస్థానాన్ని నిజాంను ఎదురించి దేశంలో విలీనం చేశారని తెలిపారు. భారతదేశ తొలి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా విశిష్ట సేవలు అందించారని, అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఐకమత్యం అనే నినాదంతో కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత బేధాలు లేకుండా దేశంలోని ప్రజలందరినీ ఏకం చేసి దేశ సమైఖ్యతను ప్రపంచానికి చాటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ జె. ప్రసాద్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లాలోని నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, ఎస్.సి. కార్పొరేషన్ డి.డి. దుర్గాప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, ముఖ్య ప్రణాళిక అధికారి జి. సత్యంలతో కలిసి దేశ సమగ్రత, సమైక్యత, అంతర్గత భద్రతను కాపాడతామని, దేశాభివృద్ధికి కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




