సృష్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఘనంగా సైన్స్ వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: భారతదేశంలో సైన్స్ ఆవశ్యకతను చాటిచెప్పిన గొప్ప శాస్త్రవేత్త సర్ సివి రామన్ అని సృష్టి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ అంబాల రాజ్ కుమార్ అన్నారు. నస్పూర్ లోని సృష్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శనివారం సర్ సివి రామన్ జయంతిని పురస్కరించుకుని సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సైన్స్ ఆవిష్కరణలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. సైన్స్ రంగంలో దేశానికి మొదటిసారి నోబెల్ బహుమతి సాధించిన ఘనత రామన్ దేనCV Raman is a great man who made India famous in the field of science: Raj Kumarని రాజ్ కుమార్ కొనియాడారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని సూచించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలు తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రయోగాల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అంబాల రజిత, వైస్ ప్రిన్సిపల్ బోనగిరి రమాదేవి, ఉపాధ్యాయులు రమ్య, దీపిక, విద్య, శిరీష, స్వరూప, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.







