వేమనపల్లి, ఆర్.కె న్యూస్: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఓటు హక్కుపై తహసీల్దార్ సాయిబాబు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉందని, ఆ విలువను ప్రతి ఓటరు తెలుసుకొని తమ అమూల్యమైన ఓటుహక్కును వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం సీనియర్ సిటిజెన్ లను శాలువాతో సత్కరించి, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఖలీక్, బిఎల్ఓ లు రాణి, జయప్రద్ర, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
12







