బాలికలు ఆత్మస్థైర్యంతో రాణించాలి

  • మంచిర్యాలలో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు
  • ‘వనిత వాక్కు’ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని వనిత వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆడపిల్లల రక్షణ, ఆరోగ్యం, చదువు ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. ఫౌండేషన్ కో-ఫౌండర్లు తాళ్లపల్లి కవిత, సునీత కుర్మ ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఆపద సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఉన్నత లక్ష్యాల దిశగా సాగాలని సూచించారు. అనంతరం గౌరవ అధ్యక్షురాలు జ్యోత్స్న చంద్రధత్, అడ్వైజరీ కమిటీ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అన్నపూర్ణ యోగా, ధ్యానం ప్రాముఖ్యతను వివరించారు. శారీరక, మానసిక దృఢత్వం కలిగినప్పుడే చదువులో రాణించగలరని, ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు బహుమతులు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎంలు బండి రమేష్, కుమార్, ఉపాధ్యాయురాలు రమాదేవిని ఫౌండేషన్ సభ్యులు శాలువాతో సత్కరించారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment