ఆర్.కె న్యూస్, నస్పూర్: విద్యార్థులు పోటీ పరీక్షల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం ఆజాది కా అమృత మహోత్సవ్ ముగింపు వేడుకలు జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సింగరేణి ఉన్నత పాఠశాల, సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు వ్యాసరచన, క్విజ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని, ప్రతిభ కనబర్చడం సంతోషకరమని అన్నారు. రాబోవు రోజుల్లో పోటీ పరీక్షల్లో బహుమతులు పొందాలని విద్యార్థులకు జనరల్ మేనేజర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్ గారు, డీజీఎంలు పి. అరవింద్ రావు చిరంజీవులు, ఏరియా రక్షణాధికారి శ్రీధర్ రావు, సీనియర్ పిఓ పి. కాంతారావు, సింగరేణి పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణమూర్తి, పాఠశాల పిఈటి హేమ, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
106