ఇందిరమ్మ ఇల్లు పథకం పేదల సొంతింటి కలను నిజం చేస్తోంది

మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
మంచిర్యాల 6వ డివిజన్‌లో నూతన గృహప్రవేశం.. పాల్గొన్న మేయర్ ధర్ని మధుకర్

నస్పూర్, ఆర్.కె న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్‌లో శనివారం లబ్ధిదారు కనకమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మున్సిపల్ మేయర్ ధర్ని మధుకర్ తో కలిసి ప్రారంభించారు. మున్సిపల్ మేయర్ ధర్ని మధుకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా గృహం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వారు పేర్కొన్నారు. గృహప్రవేశం చేసిన లబ్ధిదారు కనకమ్మకు కొక్కిరాల సురేఖ, ధర్ని మధుకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సురేఖను ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు కనకమ్మ శాలువాతో ఘనంగా సన్మానించారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించినందుకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు, సురేఖకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం కొండంత అండగా నిలుస్తోందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుల రవీందర్, 29వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్, 3వ డివిజన్ కార్పొరేటర్ పత్తి ప్రకృతి – వెంకటేష్, నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నూకల రమేష్, వివిధ విభాగాల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment