మహా రుద్రాభిషేకంలో పాల్గొన్న కొక్కిరాల సురేఖ.. భక్తులకు ప్రసాద వితరణ
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మంచిర్యాల మహాప్రస్థానంలో మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి నదికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆమె ప్రసాద వితరణ చేపట్టారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతితో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మహాశివుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని సురేఖ కోరుకున్నారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆధ్యాత్మిక శాంతి, విజయాలను నింపాలని ప్రార్థించారు. పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన సేవా కార్యక్రమాల్లో ఆమె స్వయంగా పాల్గొని ప్రసాదాన్ని పంపిణీ చేశారు.







