సింగరేణి సీఎండీతో గుర్తింపు సంఘం నేతల భేటీ

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను గుర్తింపు సంఘం నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన ఈ భేటీలో సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమ పరమైన అంశాలపై ప్రతినిధులు చర్చించారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎండీకి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. పర్యావరణ హితానికి గుర్తుగా పూల మొక్కను అందజేశారు. సంస్థ పురోగతికి గుర్తింపు సంఘం తరపున పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా నేతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కే వీరభద్రయ్య, వైవి రావు, ముస్కే సమ్మయ్య, మడ్డి ఎల్లయ్య పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment