అధికారులతో సమీక్ష నిర్వహించిన జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్. కె న్యూస్: శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం జనరల్ మేనేజర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏరియా అధికారులతో వేడుకల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయా విభాగాలు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని పెంపొందించే విధంగా ఉండాలని మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో క్వాలిటీ విభాగం బెల్లంపల్లి రీజియన్ అధికారి వీరభద్ర రావు, ప్రాజెక్టు అధికారులు ఏ. వెంకటేశ్వర రెడ్డి, చిప్ప వెంకటేశ్వర్లు, ఏజెంట్లు ఎన్. శ్రీధర్, రవికుమార్, డీజీఎంలు ఎస్. అనిల్ కుమార్, ఆనంద్ కుమార్, రవీందర్, మల్లయ్య, సర్వే అధికారి నర్సింగరావు, లా అధికారి మల్లేష్, పర్చేజ్ అధికారి చంద్రశేఖర్, సీహెచ్‌పీ ఎస్ఈ చంద్రలింగం, ఎస్టేట్స్ అధికారి వరలక్ష్మి, ఎన్విరాన్మెంటల్ అధికారి హనుమాన్ గౌడ్, వివిధ గనుల మేనేజర్లు, అధికారులు హాజరయ్యారు.








