కృషితో ఎదిగి.. ఇంజనీర్‌గా వీడ్కోలు

  • మోహినుద్దీన్‌కు ఘన సన్మానం

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఓసీపీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న మోహినుద్దీన్ 40 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకుని శనివారం పదవీ విరమణ చేశారు. గని అధికారులు, సహచర ఉద్యోగులు, ఐఎన్‌టీయూసీ నాయకులు ఆయనను సన్మానించారు. నాలుగు దశాబ్దాల కాలంలో సింగరేణి సంస్థ అభివృద్ధికి మోహినుద్దీన్ అందించిన సేవలను ఈ సందర్భంగా సహచరులు గుర్తు చేసుకున్నారు. మోహినుద్దీన్ తన వృత్తి జీవితాన్ని ఫిట్టర్‌గా ప్రారంభించి, నిరంతర కృషి, అంకితభావంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారు. ఆయన ప్రస్థానం తోటి ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని ఐఎన్‌టీయూసీ నాయకులు పేర్కొన్నారు. సంస్థ పట్ల ఆయన ప్రదర్శించిన నిబద్ధతను సన్మాన సభలో కొనియాడారు. అనంతరం మోహినుద్దీన్ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్ రావు, నాయకులు పి. తిరుపతి రాజు, ఏ. రవీందర్ రెడ్డి, సీహెచ్. జీవన్ జోయల్, శీలం చిన్నయ్య, ఓరం జగన్ పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment