మందమర్రిలో అట్టహాసంగా శ్రీ చైతన్య జోనల్ క్రీడాపోటీలు
మందమర్రి, ఆర్.కె న్యూస్: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని కలిగిస్తాయని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. మందమర్రి సింగరేణి మైదానంలో తెలంగాణ శ్రీ చైతన్య పాఠశాలల జోనల్ క్రీడాపోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, లక్సెట్టిపేట, గోదావరిఖని, కాగజ్నగర్ ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు పాఠశాల యాజమాన్యం ఈ వేదికను ఏర్పాటు చేసింది. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ క్రీడా పతాకాన్ని ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల బృందాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. విద్యతో పాటు విద్యార్థుల మానసిక వికాసం కోసం క్రీడలను నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డిప్యూటీ జీఎం అశోక్, మండల విద్యాధికారి రమేష్ రాథోడ్ అతిథులుగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలను పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య అభినందించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ సదాశివరెడ్డి, మంచిర్యాల అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అరవింద్ రెడ్డి, కరీంనగర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం రాజు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.








