హెడ్ ఓవర్ మెన్ ఐరెడ్డి తిరుపతి రెడ్డికి ఘన వీడ్కోలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వారి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ అన్నారు. ఆయన శనివారం శ్రీరాంపూర్లోని ఆర్.కె 7, ఆర్.కె న్యూ టెక్ గనులను సందర్శించారు. కార్మికులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. సమస్యలను యాజమాన్యంతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సీనియర్ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్ రావు సారథ్యంలో ఆర్.కె న్యూ టెక్ గనిలో హెడ్ ఓవర్ మెన్ ఐరెడ్డి తిరుపతి రెడ్డి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతి రెడ్డి కార్మికుల వెన్నంటి నిలబడి సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఐఎన్టీయూసీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని ప్రశంసించారు. వివిధ విభాగాల కార్మికులు తిరుపతి రెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు సిహెచ్ భీమ్ రావ్, గరిగ స్వామి, పి.తిరుపతి రాజు, పేరం రమేష్, ల్యాగల శ్రీనివాస్, ఎ.రవీందర్ రెడ్డి, అశోక్, కిషన్, న్యూ టెక్ పిట్ కార్యదర్శి మహేందర్, ఆర్.కె 7 పిట్ కార్యదర్శి రౌతు సత్యనారాయణ, రెండు గనుల పిట్ కమిటీ నాయకులు, వివిధ విభాగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








