చెన్నూరు, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాల్టీలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివిరోజు అన్ని పార్టీల నాయకులు తమ అభ్యర్థుల చేత నేమినేశండ్లను దాఖలు చేయించారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఅర్ఎస్, బీజేపీ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పెద్దమొత్తంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ పార్టీల్లోని రెబల్ అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చెన్నూరు మున్సిపాల్టీలో 18 వార్డులు ఉండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబందించిన అభ్యర్థులు అన్ని వార్డుల్లో పోటీ చేసినట్లు సమాచారం. చెన్నూరు మున్సిపాల్టీ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
11







