వ్యాధి నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకం

  • మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత
  • 71 మంది నూతన సిబ్బందికి విధి నిర్వహణపై అవగాహన

నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర ఎంతో కీలకంమని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం కొత్తగా నియమింపబడిన 71 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు ఆమె ఆధ్వర్యంలో శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్‌కు పంపే రక్త నమూనాలను సరైన సమయంలో, నిర్ణీత మోతాదులో సేకరించాలని, రోగి పేరు, ఫోన్ నంబర్, చిరునామా వివరాలను రిజిస్టర్లతో పాటు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని, సకాలంలో నమూనాలను టీ-హబ్‌కు పంపితే సాయంత్రం కల్లా రోగికి, వైద్యుడికి వాట్సాప్ ద్వారా ఫలితాలు అందుతాయని, వైద్యులు సూచించిన పరీక్షలు మాత్రమే నిర్వహించాలని పేర్కొన్నారు. బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శాస్త్రీయ పద్ధతిలో వాటిని నిర్వీర్యం చేయాలని అన్నారు. మలేరియా, డెంగ్యూ, గర్భవతుల పరీక్షలకు సంబంధించిన రాపిడ్ కిట్లను నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గర్భవతులకు చేసే పరీక్షలు, సికిల్ సెల్ రక్త నమూనాల సేకరణపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, క్షయ నియంత్రణలో ల్యాబ్ పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధాకర్ నాయక్, టీ హబ్ మేనేజర్ వెంకటేష్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ రమేష్ పాల్గొన్నారు. సిహెచ్‌ఓలు వెంకటేశ్వర్లు, నామ్ దేవ్, అధికారులు శ్రీనివాస్, అల్లాడి శ్రీనివాస్, పద్మ మార్త, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ హాజరయ్యారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment