దేశ పురోభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం

దేశ పురోభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకమని సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్డ్ మూమెంట్) డాక్టర్ జే. ఆల్విన్ అన్నారు.
జాతీయ సమైఖ్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో తెలంగాణ తల్లి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒకప్పుడు సంస్థానంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర భారత దేశంలో విలీనమై నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి, సమైక్య భారతాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) ఎం సురేష్ మాట్లాడుతూ భారత దేశ ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం ఐటీ తదితర రంగాల్లో తన వంతు సహకారం అందిస్తూ జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. సింగరేణి సంస్థ తగినంత బొగ్గు ఉత్పత్తి, థర్మల్ విద్యుత్ ద్వారా రాష్ట్ర ప్రగతికి సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్ భాస్కర్, డీజీఎంలు ప్రదీప్ కుమార్, విజయేందర్ రెడ్డి,  తాడబోయిన శ్రీనివాస్, సింగరేణి భవన్ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment