ఆర్.కె-న్యూటెక్ మేనేజర్ కురపాటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో కంపెనీకి చేసిన సేవలు ఎంతో గొప్పవని ఆర్.కె-న్యూటెక్ గని మేనేజర్ కురపాటి శ్రీనివాస్ అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె-న్యూటెక్ గనిలో శనివారం హెడ్ ఓవర్ మెన్ ఐరెడ్డి తిరుపతిరెడ్డి, హాలేజ్ ఆపరేటర్ టి. అంజయ్య పదవీ విరమణ పొందారు. వీరిని గని మేనేజర్ కురపాటి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. సంస్థ అభివృద్ధిలో ఉద్యోగుల కృషి మరువలేనిదని కొనియాడారు. పదవీ విరమణ తర్వాత జీవితం కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని కురపాటి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా కమిటీ ఛైర్మన్ జనక్ ప్రసాద్, గుర్తింపు సంఘం ఉపప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, తెబొగకాసం ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఉద్యోగులను సన్మానించారు. సంస్థ పురోగతిలో కార్మికుల పాత్రను వారు ప్రశంసించారు. సహచర కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పదవీ విరమణ పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి కొట్టె రమేష్, సీనియర్ సంక్షేమాధికారి పాల్ సృజన్, పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.







