మున్సిపల్ కార్పొరేటర్లకు టీఎన్జీవోల ఘన సన్మానం

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి

మంచిర్యాల ఆర్.కె న్యూస్: మంచిర్యాల టీఎన్జీవో జిల్లా శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్పొరేటర్లను శుక్రవారం ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి నేతృత్వంలో ప్రతినిధుల బృందం కార్పొరేటర్లు రాచకొండ గోపాల్ రావు, సుదమల్ల హరికృష్ణలను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి నిరంతరం సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా శ్రీహరి కోరారు. శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్లు ఈ సందర్భంగా ప్రకటించారు. నగర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తామని భరోసా ఇచ్చారు. తమకు సన్మానం చేసినందుకు టీఎన్జీవో జిల్లా శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాంకుమార్, తిరుపతి, అంజయ్య, నరేందర్, శ్రీధర్ రాజుతదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment