వేమనపల్లి, ఆర్. కె న్యూస్: తెలంగాణ గ్రామీణ బ్యాంకులు ప్రవేశపెట్టే పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని నీల్వాయి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శివశంకర్ అన్నారు. బుధవారం చామనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బద్దంపల్లిలో బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అర్హులైన ఖాతాదారులందరూ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకంలో రూ. 436 చెల్లించి రూ.2 లక్షల బీమాను పొందలన్నారు. అటల్ పెన్షన్ యోజన పథకం, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు ఉపయోగించుకోవాలని కోరారు.








