వయోవృద్ధుల సంక్షేమానికి సహకరించాలి

  • జాయింట్ కలెక్టర్‌కు అసోసియేషన్ డైరీల అందజేత

మేడ్చల్, ఆర్.కె న్యూస్: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ విజేందర్ రెడ్డిని కలిశారు. వయోవృద్ధుల సంక్షేమం, వారికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన సౌకర్యాల కల్పనలో సంఘాలకు పూర్తి సహకారం అందించాలని కోరుతూ అసోసియేషన్ డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ అధికారి కరుణాకర్ రెడ్డి, స్త్రీ, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులకు కూడా డైరీలను పంపిణీ చేశారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమ పథకాల అమలుకు అధికార యంత్రాంగం అండగా ఉండాలని డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోట రంగయ్య, ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్ల హక్కుల పరిరక్షణకు తమ సంఘాలు నిరంతరం కృషి చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వి. ఇన్నా రెడ్డి, ఆర్గనైజేషన్ సెక్రటరీ పి. నర్సయ్య, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు యాది రెడ్డి, ఉపాధ్యక్షుడు కె. వెంకయ్య, కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment