- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మెజారిటీ స్థానాలను గెలుచుకొని మంచిర్యాల కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. నస్పూర్ ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని చెప్పారు. ప్రజలు కెసిఆర్ పాలనను మళ్లీ కోరుకుంటున్నారని వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హయాంలో మంచిర్యాల నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందిందని విజిత్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రం ఏర్పడిందని, నస్పూర్ మండలం ఏర్పాటుతో పాటు కలెక్టరేట్ భవన నిర్మాణం కూడా అప్పుడే జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సింగరేణిలో కారుణ్య నియామకాలను పునరుద్ధరించి కార్మిక కుటుంబాల్లో కెసిఆర్ వెలుగులు నింపారని కొనియాడారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు విఫలమయ్యాయని ఆరోపించారు. కార్మికులకు కనీసం సరైన మందులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సింగరేణి సంస్థ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి పరిరక్షణ టిబిజికెఎస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. కార్మికులకు అనేక హక్కులు సాధించిన చరిత్ర తమ సంఘానికే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్కూరి సుబ్బయ్య, మెరుగు పవన్ కుమార్, వంగ తిరుపతి, బండి రమేష్, జక్కుల రాజేశం, పానుగంటి సత్తయ్య, గుంట జగ్గయ్య, ముక్కెర వెంకటేశం, అన్వేష్ రెడ్డి, పొగాకు రమేష్, తిప్పని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.







