సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: స్థానిక పివిఆర్ గార్డెన్‌లో ఆదివారం పురగిరి క్షత్రియ పెరిక సంఘం నూతన సంవత్సర (2026) క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చుంచు రాజ్ కిరణ్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు బొడ్డు తిరుపతి, నస్పూర్ సీనియర్ నాయకులు తిప్పని రామన్నల ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్ మాట్లాడుతూ.. సమాజంలో పెరిక సంఘం గుర్తింపు కోసం, కుల బాంధవుల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. సంఘం బలోపేతానికి యువత, పెద్దలు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి చుంచు రాజ్ కిరణ్ మాట్లాడుతూ, సంఘం చేపట్టే సేవా కార్యక్రమాల్లో సభ్యులందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







