సంఘం బలోపేతం, ఆలయ అభివృద్ధే లక్ష్యం
అధ్యక్షులు చిలకాని బొడ్డయ్య, సిరిపురం రామన్న
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయ ప్రాంగణంలో ఆదివారం పద్మశాలి సంఘం, మార్కండేయ ఆలయ కమిటీల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు గడ్డం సుధాకర్, జిల్లా అధ్యక్షులు గడదాసు బాపు, మందమర్రి పట్టణ అధ్యక్షులు చిలువేరు సుదర్శన్ ల పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియ అత్యంత ఉత్సాహంగా సాగింది. పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చిలకాని బొడ్డయ్య, ప్రధాన కార్యదర్శిగా కుందారపు రమేష్, కోశాధికారిగా చిప్ప రాజబాబు ఎన్నికయ్యారు. మహిళా విభాగం అధ్యక్షురాలుగా చిప్ప సులోచన, ప్రధాన కార్యదర్శిగా పెరుమాండ్ల సరోజ బాధ్యతలు చేపట్టారు. అలాగే, శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత ఆలయ కమిటీ అధ్యక్షులుగా సిరిపురం రామన్న, ప్రధాన కార్యదర్శిగా తౌటం మల్లేష్, కోశాధికారిగా సబ్బని భాస్కర్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు చిలకాని బొడ్డయ్య, సిరిపురం రామన్న మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తామని పేర్కొన్నారు. కుల బాంధవులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సంఘాన్ని అన్ని విధాలా బలోపేతం చేస్తామని, పద్మశాలీల సంక్షేమానికి కృషి చేస్తామని బొడ్డయ్య తెలిపారు. అనంతరం రామన్న మాట్లాడుతూ, భక్తుల సహకారంతో ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఆలయ ప్రాంగణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండ శ్రీనివాస్, చిలివేరి శరబంధం, దేవసాని నాగరాజు, మిట్టపల్లి మధు, కటకం లక్ష్మణ్, కుందారపు రాములు, ఆడేటి రాజన్న, కన్నం సాంబయ్య, కుసుమ శంకర్, క్యాతం రాజేష్, సింగని వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.







