మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ఆదేశాలతో నస్పూర్ లో ముఖ్య నాయకుల భేటీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ఏరియా 5, 6వ డివిజన్లలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యకలాపాలను వేగవంతం చేసింది. రానున్న కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకుని, మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ఆదేశాల మేరకు ఆదివారం నస్పూర్ పట్టణ అధ్యక్షులు అక్కూరి సుబ్బయ్య పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ ప్రచార కార్యదర్శి ఆకునూరి సంపత్, మాజీ సర్పంచ్ గుంట జగ్గయ్య, 6వ డివిజన్ నాయకులు రఫీక్ ఖాన్ నస్పూర్ పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు వైద్య శ్రీలత, రమాదేవి, రాజేశ్వరి, మాజీ ఎంపీటీసీ సురేష్, నాయకులు పెరుక సత్తయ్య, కనకం సంపత్ తో పాటు పెద్ద సంఖ్యలో మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.



